*ఇంద్ర మహిళ శక్తి ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, మహిళ సంఘాలకు చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్* *==మహిళల అభివృద్ధి కాంగ్రెస్ అభివృద్ధ
అక్షర విజేత గోపాల్పేట్, రేవల్లి;
వనపర్తి జిల్లా గోపాలపేట, రేవల్లి మండలాలకు సంబంధించి గోపాలపేట మండల కేంద్రంలోని సోమవారం పద్మావతి ఫంక్షన్ హాల్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ఎమ్మెల్యే, కలెక్టర్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు.శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ 9న మొదటి సంతకం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ఫైల్ మీద చేయడంజరిగిందన్నారు. ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు సారె పంపిణీ కార్యక్రమంనిర్వహిస్తోందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని చెప్పారు. సిరిసిల్ల నేత కార్మికుల ద్వారా నేసిన చీరలను మహిళలకు పంపిణీ చేస్తుందని చెప్పారు.18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి మహిళా సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళకు ఇస్తున్న చీరలు చాలా నాణ్యమైనవని, రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు ఉండాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. వనపర్తి నియోజకవర్గానికి తొలి విడత లో 3500 ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా గత పదివేలలో ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులను అందజేసింది అని చెప్పారు. అంతేకాకుండా రేషన్ కార్డుదారులందరికి సన్న బియ్యం అందిస్తుందని గుర్తు చేశారు.మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులను చేయడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి లు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల పనులు ఇవ్వడం జరిగింది. పెట్రోల్ పంపులు, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సులకు యజమానులు, మహిళా శక్తి క్యాంటీన్ లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పేదలకు తెల్ల రేషన్ కార్డులు , సన్న బియ్యం, వంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలోనే జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన మహిళా సమాఖ్య భవనం త్వరలో పూర్తి కానున్నట్లు తెలిపారు. 2014 కన్నా ముందు 67,000 మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ కి చెప్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని, కెసిఆర్ పార్టీ దయ్యాల పార్టీ అని కెసిఆర్ కూతురు కవిత తెలియజేశారని అయినా తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి లో భాగంగా మహిళలకు నాణ్యమైన చీరలను అందజేస్తుందని చెప్పారు. ఈ చీరలను ప్రతి జిల్లా నుంచి మహిళా సమాఖ్య అధ్యక్షులు హైదరాబాదుకు వెళ్లి ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఈ చీరలను రూపొందించడం కోసం 10,000 మంది నేతన్నలు శ్రమించారని కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లాలో మహిళా సంఘం సభ్యులు ప్రతి ఒక్కరికి చీర ఇవ్వడం జరుగుతుందని, సంఘంలో లేని మహిళలను సైతం సంఘంలో చేర్చుకొని చీర ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా త్వరలోనే జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన మహిళా సమాఖ్య భవనం త్వరలో పూర్తి కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసిన విధంగానే పెబ్బేరులో సైతం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ ఉమాదేవి, అదనపు డి ఆర్ డి ఓ సుజాత, డిప్యూటీ కలెక్టర్ రంజిత్ రెడ్డి, మండల ఉమ్మడి మండల నాయకులు సత్య శిలా రెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, మండలాధికారులు గోపాల్పేట తాహసిల్దార్ తిలక్ కుమార్ రెడ్డి, ఏదుల తాహసిల్దార్ మల్లికార్జున్, గోపాల్పేట ఎంపీడీవో అయోష అర్జుమ్, రేవెల్లి ఎంపీడీవో, సింగిల్ విండో చైర్మన్ రఘు యాదవ్, కాంగ్రెస్ నాయకులు శివన్న ,కొంకి వెంకటేష్, కొంకి రమేష్, గుత్త సురేందర్ రెడ్డి,కేతేపల్లి వెంకటయ్య, దిరుమల యాదవ్, చంద్రయ్య యాదవ్, అడ్వకేట్ ఆంజనేయులు,యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, ప్రధాన కార్యదర్శి బొక్కలయ్య యాదవ్, ధన్వాడ నాగరాజు యాదవ్,లోకా రెడ్డి, కర్ణాకర్, అబ్దుల్లా, చరణ్, వంశీకృష్ణ,వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతినిధులు మూడు మండలాల ఏపీవోలు, ఏపీఎంలు, వివిధ మండలాల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వెంకటమ్మ, సంఘం అధ్యక్షులు బిఎల్వోలు, మహిళా సంఘం సభ్యురాలు వివిధ మండలాల మహిళా సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.