ఆహ్లాదకరం-ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా పాల్గొన్న పాత్రికేయ కుటుంబ సభ్యులు
తాడేపల్లిగూడెం (అక్షర విజేత)
పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో: నిత్యం వార్త సేకరణలో తలమునకలై కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే అవకాశం లేని పాత్రికేయులకు వారి కుటుంబ సభ్యులకు ఆదివారం ఆటవిడుపుగా మారింది. దీనికి జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ నిర్వహించిన పాత్రికేయ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం వేదికగా నిలిచింది. తాడేపల్లిగూడెం మండలం పడాల మార్కెట్ యార్డులో ఉదయం గణపతి పూజా కార్యక్రమంతో ప్రారంభమైన సమావేశం అధ్యంతం ఉత్సాహ, ఉల్లాస భరిత వాతావరణంలో సాయంత్రం వరకు కొనసాగింది. యాంకర్ల ఉత్సాహపరిచే మాటలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో రాజకీయ ఆధ్యాత్మిక, సామాజిక సేవా రంగాలకు సంబంధించిన ప్రముఖుల ఉపన్యాసాలతో కార్యక్రమం కొనసాగింది. పాత్రికేయుల కుటుంబాల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగా సురేష్ ను పలువురు అభినందించారు. భవిష్యత్తులో కూడా పాత్రికేయులందరూ కలిసికట్టుగా ఉండి ముందుకు సాగాలని వారికి అవసరమైన అండదండలు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ రఘురామ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి కొట్టు నాగేంద్ర, నిమ్మల నాని, మున్సిపల్ మాజీ కౌన్సిలర్, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు, లక్ష్మీనారాయణ థియేటర్ అధినేత ఎలిశెట్టి మోహన్, భారతీయ జనతా పార్టీ జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశి, జీకే జ్యువెలర్స్ అధినేత గురజాడ ఆనంద్ కుమార్, స్టార్ హాస్పిటల్ అధినేత రవిశంకర్, వాసవి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గ్రంధి సత్యనారాయణ, నిమ్మల నాని, షేక్ బాజీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్నిడి బాబ్జి, ఎస్ ఫోర్ ఛానల్ అధినేత బుజ్జి, తిరుమల బిల్డర్ సూరిబాబు, బాల బొమ్మల శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎంపీపీ శేషులత, గొర్రెల శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో పాత్రికేయులు పాత్ర కీలకమైందని మారుమూల గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలకు అండగా ఉంటున్నారని ప్రశంసించారు. పాత్రియులందరూ కుల మతాలకు అతీతంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. సమ్మేళనలో పాల్గొన్న ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జిల్లా స్టాఫ్ రిపోర్టర్ల ను రంగా సురేష్ ఘనంగా సత్కరించారు. వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. పాత్రికేయ కుటుంబ సభ్యులకు ఎన్నో విలువైన బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి గోలిమే బుచ్చిబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రవికుమార్ రాజు, పాలచర్ల రవీంద్రనాథ్ , దుర్గాప్రసాద్, ఆదినారాయణ, గంటా శీను, కొప్పిశెట్టి ప్రసాద్, తోట ధరణి, ఆకుల రాంప్రసాద్, ఆకుల విజయకుమార్, అడపా సూరి ప్రకాష్, కంకట శ్రీనివాస్, వర్ధన్, దేవా శివప్రసాద్, సుందర నీడి లక్ష్మయ్య, ఊస దుర్గారావు, భాను ప్రకాష్, నాని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. లీల యాంకరింగ్ అధ్యంతం ప్రేక్షకులను అలరించింది.