బిజెపితోనే దేశాభివృద్ధి సాధ్యం.. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి..
అక్షర విజేత, పెద్ద శంకరంపేట్:
పెద్ద శంకరంపేట్.. భారతీయ జనతా పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి అన్నారు.. సోమవారం పెద్ద శంకరంపేట లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మెదక్ జిల్లా బిజెపి నాయకులు కోణం విట్టల్. పేట మండల బిజెపి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు బిజెపి పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు.. ఇటీవల బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎన్డీఏ కూటమికి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని పేర్కొన్నారు.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బిజెపి పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలి అన్నారు.. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి నాయకులు కోణం విట్టల్.. పేట మండల బిజెపి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్.. మండల ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణ.. బీజేవైఎం అధ్యక్షుడు బుగుడాల కృష్ణ.. నాయకులు చందుపట్ల అనిల్.. రహీం ధ్రువ కుమార్ తదితరులు పాల్గొన్నారు..