గ్రామీణ పిల్లల రక్షణ కమిటీ తగు సూచన.
అక్షర విజేత, చిన్నంబావి.
చిన్నంబావి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామీణ పిల్లల రక్షణ కమిటీ సమావేశం కు ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్, తాసిల్దార్ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆసియా బేగం, ఏపిఎం మద్దిలేటి ,ఏపీవో ధనుంజయ రాజ్ ,కమిటీ సభ్యులుగా ఉండి బాలల హక్కులకు భంగం కలిగించకుండా ఉండడానికి తగు సూచనలు, సలహాలు , వారి హక్కుల గురించి క్షేత్రస్థాయి అధికారులకు వివరించారు. వారి యొక్క హక్కులకు భంగం కలిగించకుండా , శారీరకంగా, మానసికంగా, ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని, డ్రాప్ అవుట్ లు తగ్గించడం కొరకు అనుసరించవలసిన విధానాలు, బాల్య వివాహాలు చేసుకునే వారిపై, వారి తల్లిదండ్రులపై, సహకరించిన పెద్దలపై, పూజారులపై, మతపెద్దలపై, చర్చిలలో జరిగితే పాస్టర్ల వంటి వారిపై పోక్సో చట్టం, బాల కార్మిక నిరోధక చట్టం వంటి మొదలైన చట్టాల కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని ఎస్ఐ నాగరాజు తెలియజేశారు. బాల్యవివాహాలు, బాల కార్మికులు గా ఎవరైతే పనిలో పెట్టుకుంటారో వారిని పిల్లల తల్లిదండ్రులకు ఈ చట్టాలు వర్తిస్తాయని తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్ క్షుణ్ణంగా వివరించారు . బాలల హక్కులను సంరక్షిస్తూ వారి సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయవలసిందిగా తెలియపరచారు. అదే విధంగా ప్రభుత్వం కల్పించిన విద్య హక్కు చట్టం ద్వారా నిరుపేదలైనటువంటి ప్రతి పాఠశాలలో విద్యార్థులకు 25 శాతం సీట్లు ప్రైవేట్ స్కూళ్లలో విద్యాహక్కు చట్టం ద్వారా విద్యను బాలలకు ఉచితంగా అందించాలని వివరించారు . ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సీసీలు, హాజరయ్యారు.