పిల్లలే ఈ దేశ అసలు సంపద - ఎంపీపీఎస్ మంచినీళ్లపల్లిలో బాలల దినోత్సవ వేడుకలు ఘనం
అక్షర విజేత,ములుగు జిల్లా ప్రతినిధి:-
భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీపీఎస్ మంచినీళ్లపల్లి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించి సమావేశంలో విద్యార్థులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించారు.విద్యార్థులు వివిధ జాతీయ నాయకుల వేషధారణలతో అలరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.దిలీప్ మాట్లాడుతూ...నిజానికి ఈ దేశ సంపద అంటే నేటి పిల్లలే అని అన్నారు.ఈ పిల్లలను ఆరోగ్యకరంగా,ఆనందకరంగా పెంచితే భవిష్యత్తు భారత దేశం అఖండంగా వెలుగొందుతుంది అన్నారు.ప్రభుత్వం ఈ నెల పిటిఏం లో పిల్లలకు ఆనందకరమైన బాల్యాన్ని అందించడం అనే అంశం మీద అవగాహన కల్పించడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.తల్లిదండ్రులంతా విద్యార్థులకు ఇంటివద్ద మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా,వారు ఆనందంగా గడిపేలా, చదువుకోవడానికి అవసరమైన అనువైన పరిస్థితిలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో విద్యార్థులు జవహర్ లాల్ నెహ్రూ,భగత్ సింగ్,గాంధీ,సావిత్రి భాయ్ పూలే తదితర వేషాలతో పాటు సంప్రదాయ దుస్తులు ధరించి అలరించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఉమాశంకర్,అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ప్రియాంక మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.