*కల్లు గీత కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు..* *ఈనెల 28న చలో సూర్యాపేట.* *ఇంటికో గౌడు ఊరుకో వాహనంతో తరలిరావాలి.* *కల్లుగీత కార్మిక
అక్షర విజేత, ములుగు జిల్లా ప్రతినిధి:-
ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న కల్లుగీత కార్మిక సమస్యలపై ఏమాత్రం స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రవి గౌడ్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశంజిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఉయ్యాల మధుకర్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కేంద్రం లోని సీఐటీయూ కార్యాలయం లో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన రవి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ తాటి చెట్ల పైనుండి పడిన బాధితులపెండింగ్ లో ఉన్నా ఎక్స్ గ్రేషియాలు 12 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని అలాగే తాడి కార్పొరేషన్ సంబందించిన పెండింగ్ చెక్కులు విడుదల చేయాలని ప్రతి కల్లుగీత కార్మికునికి సేఫ్టీమోకులు తక్షణమే అందజేయాలని
50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మిక ఎటువంటి శరతులు లేకుండా వృత్తి పింఛన్ సాంక్షన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం లో అప్పుడు ఎం ఎల్ ఎ గా ఉన్నా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏజెన్సీ లో అనాదిగా కల్లు గీత వృత్తి చేస్తున్నా గీత కార్మికుల కు సోసైటీ లు పునరుద్దరణ చేయాలనీ అసెంబ్లీ లో మాట్లాడటం జరిగిందని ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిన కూడాఇప్పటిదాకా ఏజెన్సీ గీత కార్మికుల విషయం లో స్పందించక పోవడం సరికాదని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీలు అమలు చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న సూర్యాపేట జిల్లా కేంద్రం లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ బహిరంగ సభకు జిల్లా లోని ప్రతి సొసైటీ నుండి ఇంటికో మనిషి ఊరుకో వాహనంతో పెద్ద ఎత్తున తరలి రావాలని గీతకార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కల్లుగీత సోషల్ మీడియా కన్వీనర్ ఉ య్యాల మధుకర్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు రుద్రబోయిన మల్లేష్ గౌడ్ పులి రమేష్ గౌడ్ జిల్లా సహాయ కార్యదర్శి మామిండ్ల సంపత్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు మునిగాల సుధాకర్ గౌడ్. నక్క యాకయ్య గౌడ్
వత్సవాయి సారయ్య గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు..