ములుగు జిల్లాలో బాలల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు!
అక్షర విజేత, ములుగు జిల్లా ప్రతినిధి:-
శుక్రవారం రోజున ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాకారం గ్రామంలోని గిరిజన బాలికల పాఠశాల లో జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ సూచనల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పాల్గొని మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు అని, మన దేశ భవిష్యత్తు బాల బాలికల చేతిలోనే ఉన్నదని,మన భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జన్మదినం రోజున బాలల దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. అలాగే డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ మాట్లాడుతూ బాల్యవివాహచట్టాల గురించి, బాలకార్మికుల చట్టాల గురించి వివరించి,చట్టాల పై అవగాహన ఇప్పటినుంచే పెంచుకోవాలని,బాల బాలికలు మంచి మార్గాన్ని ఎంచుకోవాలని, ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని, ఉచిత న్యాయ సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 15100 కు కాల్ చెయ్యాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయురాలు ఎం. అనిత, ఉపాధ్యాయురాలు ఎస్. లత, పి. రజిత, జి. శిరీష మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.