//*శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్..
పల్నాడు జిల్లా అక్షర విజేత
పల్నాడు జిల్లా ఎస్పీ *బి.కృష్ణారావు ఐపీఎస్* ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధి పేట సన్నేగండ్ల గ్రామం నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి *ప్రజలకు మేమున్నాము* అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా... ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీ లలో గ్రామంలో సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, ఘాతాల కర్రలు -2, పెద్ద కత్తులు - 2,కొడవళ్ళు-14, గొడ్డళ్లు- 8,గునపాలు-6, స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.
అంతేకాకుండా... రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పాత కేసుల నిందితుల తో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
గురజాల డి.ఎస్పి జగదీష్ ,
గురజాల రూరల్ సిఐ
టి వి శ్రీనివాస రావు , మాచర్ల రూరల్ సిఐ ఎస్.కె.నఫీజ్ భాష ,పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు 7 మంది ఎస్సైలు, ఏఎన్ఎస్ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది మంది పాల్గొన్నారు.