*10 వ వార్డు అధ్యక్ష కార్యదర్శులుగాఅజారుద్దీన్, దరియావలి లు ప్రమాణ స్వీకారం
చిలకలూరిపేట అక్షర విజేత
ప్రత్తిపాటి గార్డెన్స్ లో బుధవారంనాడు జరిగిన నియోజకవర్గ స్థాయి పార్టీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పట్టణంలోని 10 వ వార్డు అధ్యక్ష కార్యదర్శులుగా షేక్ అజారుద్దీన్,షేక్ దరియావలి లు కూడా ప్రమాణ స్వీకార చేశారు అనంతరం మన అందరి ప్రియతమ నాయకులు మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఇరువురిని శాలవ తో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కూటమి ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమ పథకాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అదే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని మార్గ దర్శనం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దాసరి ఉషారాణి,నియోజకవర్గ సమన్వయ కర్త నెల్లూరి సదాశివరావు,మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా,
మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని,పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్,పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి,క్లస్టర్ ఇంచార్జి ముల్లా కరిముల్లా,
యూనిట్ ఇంచార్జి అబ్దుల్ మజీద్,
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మురుకొండ మల్లిబాబు, టీడీపీ మున్సిపల్ పక్ష నాయకులు గంగా శ్రీనివాసరావు,వివిధ హోదాల్లోని నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.