అనాథవృద్దాశ్రమానికి శ్రమానికి చిన్నారుల చిరు సాయం....
అక్షరవిజేత మామడ:
మండలం లోని పొన్కల్ గ్రామ శ్రీ సాయి స్కూల్ విద్యార్థులు శ్రీసాయి అనాథవృద్ధాశ్రమ వెల్ఫేర్ సొసైటీ వారికి గురువారం రోజున రూ. 8000/-విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్ మాట్లాడుతూ.. చిన్నారులకు తల్లిదండ్రులు,బంధువులు తరచూ ఇచ్చే పాకెట్ మనీ వృధా ఖర్చు చేయకుండా ఆదా చేసి సేవా కార్యక్రమాలకు అందివ్వడం హర్షించదగ్గ విషయం..తాము విద్యార్థి దశ నుంచే తోటివారికి, పేదలకు సాయం చేసే గుణం ఉండాలని అలాగే విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవ చేయడానికి ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు,ఆశ్రమ నిర్వాహకులు, తదితరులు ఉన్నారు