*సైబర్ మోసగాడి అరెస్ట్*
*అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-*
కొమురం భీం ఆసిఫాబాద్ టెలిగ్రామ్
లింక్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసి నగదు కాజేసిన కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గత జూన్ 4న ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ కు టెలిగ్రామ్ లింక్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మిం చి మోసం చేశారని పిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాలపై టౌన్ సీఐ డి-ఫోర్ సి బృందం పోలీస్ సిబ్బంది రెండు బృందా లు కలిసి విచారణ చేపట్టి బాధితుడి ఖాతా నుండి పోయిన మొత్తం 60,582 రూపాయల నగదును హోల్డ్ చేయించారు దర్యాప్తులో చేపట్టగా గుజ రాత్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులు పంక జ్, శైలేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు ఈ కేసులో ముగ్గురు ఉన్నారని నిందితుల విచారణ లో తేలింది నిందితుడు ఇచ్చిన సమాచారంతో మూడో నిందితుడు గుజరాత్ రాష్ట్రం భావ్‌నగర్ జిల్లా పాలితన తాలూకా కాకారియా గ్రామానికి చెందిన మిథుల్ భాయ్ కలుభాయ్ గుర్తించారు ఆసిఫాబాద్ పోలీసులు గుజరాత్ కు వెళ్లి అతడిని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌తో ఆసిఫాబాద్‌కు తీసుకువచ్చారు న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు