బీమా చేయండి ధీమాగా ఉండండి...ఇండియన్ పోస్టల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వెంకటస్వామి!
అక్షరవిజేత మామడ :
మండలంలోని పొన్కల్ గ్రామంలో తపాలా బీమా పై గ్రామస్తులకు అవగాహన సదస్సు గురువారం రోజున నిర్వహించారు.సందర్భంగా ఇండియన్ పోస్టల్ బ్యాంక్ పేమెంట్ బ్రాంచ్ మేనేజర్ వెంకటస్వామి మాట్లాడుతూ
తపాలా శాఖ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని రోడ్డు ప్రమాదాలు ఇతరత్రసంఘటనల్లో గాయపడినా,మరణించినా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తపాలా బీమా చేసినట్లయితే జీవితానికి ధీమాగా ఉంటుందన్నారు. తపాల శాఖలో ఉన్న బీమాకు తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించి రూ.పదిలక్షల వరకు బీమా పొందవచ్చని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తపాలా కార్యాలయం బ్రాంచ్ మేనేజర్ లిఖిత, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.