డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 8 మందికి జైలు శిక్ష ... 13 మందికి భారీ జరిమానా
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి :
మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడ్డ 21 మందిలో 13 మందికి జరిమానా విధించగా, 8 మందికి జైలు శిక్ష విధించినట్లు సిఐ ప్రసాద్ తెలిపారు. మద్యం తాగి పట్టుబడ్డ వారిని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ట్రాఫిక్ సి ఐ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ ఎదుట హాజరుపరచగా 13 మందికి ఒక్కొక్కరికి 10, 000/- చొప్పున మొత్తం 1,30,000/- జరిమానా విధించారు. 8 మందికి జైలు శిక్ష విధించిగా వారిలో మందముల నాగరాజు, ఐలా సుదీర్ కుమార్, మరోటి బస్వంత్, దూలండి దినేష్, గుర్రాల గంగాధర్, చవాన్ ప్రకాష్ లకు ఏడు రోజులు జైలు శిక్ష విధించారు. అలాగే బస్వారాజ్ కేంద్రీ 5 రోజులు, తులిసాకు ఓబుళరెడ్డి ప్రసాద్ 4 రోజులు జైలు శిక్ష విధించినట్లు సిఐ ప్రసాద్ తెలిపారు.