*మానవ విలువలను కాపాడుతున్న ఇందిరా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్*
*అక్షర విజేత, ఉప్పల్ రామంతపూర్*
మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్ ఇంద్ర నగర్ మార్కండేయ ఆలయం వద్ద ఒంటరిగా నివసించే పెంటమ్మ(55) అనారోగ్యం తో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఇందిరా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, మరియు ఇందిరా నగర్ కాలనీ వాసుల ఆర్ధిక సహాయంతో అంత్యక్రియలు స్థానిక రాజేంద్ర నగర్ కాలనీ హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. కాలనీ వాసులు, చొరవ తీసుకుని తమ మానవతా దృక్పథం చాటుకున్నారు. ఈ సందర్భం కాలనీ వాసులు మాట్లాడుతూ పెంటమ్మ అంత్యక్రియలకు సేకరించిన విరాళాలు ఆమె అంత్యక్రియ కోసం వెచ్చించి, మిగిలిన మొత్తం పెంటమ్మ పేరు పై పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించారు, తద్వారా కి.శే.పెంటమ్మ అనదా కాదు అని ఆమెకు అన్ని తమై ముందు ఉండి తన ఆత్మ శాంతి చేకూరేలా భగవంతుడిని ప్రార్థిస్తూనామ్ అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రముఖులు, జక్రియ, ఆపిల్.శ్రీను, సాజన్, మున్నా, సత్యనారాయణ, ప్రేమ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, దీపక్, అక్తర్ బేగం, భారీగా మహిళలు, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు విద్యాసాగర్ కాసోజు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు, ప్రజాప్రతినిధులు ఫోన్ ద్వారా కాలనీ వాసులని అభినందించారు.