*రూ. 85లక్షల వ్యయంతో కాప్రా ఎల్లారెడ్డిగూడా స్మశానవాటిక అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి*
*అక్షర విజేత, కాప్రా*
మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి ఈరోజు రూ. 85లక్షల వ్యయంతో ఎల్లారెడ్డిగూడా స్మశానవాటిక అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ- కాప్రా డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడా స్మశాన వాటిక అభివృద్ధికి రూ. 85లక్షల నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులలో భాగంగా ఈరోజు పవర్ బోర్ డ్రిల్లింగ్ పనులను ప్రారంభించామన్నారు.ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని స్థానిక ఎల్లారెడ్డిగూడ స్మశానవాటిక అభివృద్ధి పనులకు గత నెల భూమిపూజ చేశామని,. అతి పురాతన స్థానిక స్మశానవాటిక గత ప్రభుత్వ నిర్లక్షానికి గురై స్థానికులైన ఎల్లారెడ్డిగూడా గ్రామవాసులకు తీవ్ర అసౌకర్యానికి, అవస్థలకు గురిచేసినందన్నారు.అధ్వాన్నంగా తయారైన స్మశాన వాటిక విషయం ఎల్లారెడ్డిగూడ గ్రామ వాసులు-డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు తన దృష్టికి తీసుకురావడంతో, తాను స్వయంగా పర్యటించి, స్మశానవటికను అభివృద్ధి చేస్తానని ఎల్లారెడ్డిగూడ వాసులకు హామీ ఇచ్చి ఈరోజు పనులను ప్రారంభించానన్నారు.స్మశానవాటికలో నూతన బర్నింగ్ ప్లాటుఫారంలు రెండు, వెయిటింగ్ హాల్, స్నానపు గదులు, అంతర్గత రోడ్లు, మూత్ర శాలలు మరియు మొక్కలతో సుందరీకరణ వంటి పనులను చేపట్టి మోడ్రన్ స్మశాన వాటికగా నిర్మించి గ్రామవాసులకు ఇచ్చిన హామీ నెరవేర్చబోతున్నామన్నారు. కాప్రా డివిజన్ అభివృద్ధికి తనకు వెన్నంటి ప్రోత్సహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఈ స్మశానవాటిక అభివృద్ధి కి పూర్తి సహకారం అందించి నిధులు మంజూరు చేయుటకు కృషి చేశారన్నారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికై పాటుపడుతున్నానన్నారు.గత ప్రభుత్వాల అసమర్థతో నిర్లక్ష్యంతో తాము ఎన్నోమార్లు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కానీ తమ ఎల్లారెడ్డిగూడ స్మశాన వాటిక అభివృద్ధి పనులు ఈరోజు డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి చేతులమీదుగా ప్రారంభమవ్వడం సంతోషంగా ఉందని, ఈ విషయమై తాము కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా, వారు స్పందించి స్వయంగా పర్యటించి, ప్రతిష్టాత్మాకంగా తీసుకొని, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, భారీ నిధులతో అనగా రూ 85లక్షలతో ఎల్లారెడ్డి గూడా స్మశానవాటిక అభివృద్ధి- సుందరీకరణ పనుల ను ప్రారంభించడంతో హర్షం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి కి మరియు ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డికి ఎల్లారెడ్డిగూడా గ్రామవాసులు ధన్యవాదములు తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యస్సి సెల్ చైర్మన్ శ్రీ పత్తి కుమార్ , జిల్లా ఏఎంసి మాజీ డైరెక్టర్ కొబ్బనూరి నాగరాజు , ఎల్లారెడ్డిగూడ గ్రామవాసులు సత్తిరెడ్డి, అల్లం శంకర్ యాదవ్, , కాప్రా డివిజన్ కాంగ్రెస్ నాయకులు పి పవన్ కుమార్,శ్రీధర్ రెడ్డి,ఉప్పల వినోద్ కుమార్, పడమటి మల్లారెడ్డి, నరేందర్ గౌడ్, తన్నీరు శ్రీహరి, రిజ్వాన్ ఖాన్, ప్రదీప్, మూర్తుజా తదితరులు పాల్గొన్నారు.