సోయ కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం బిచ్కుంద మండల రైతులు గత రెండు నెలలుగా సోయా కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నాం
అక్షర విజేత బిచ్కుంద
సోయా కొనుగోలు చేయాలని బిచ్కుంద మండల రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోయ కొనుగోలుపై రోజుకో నిబంధన పెట్టి రైతులకు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.
అకాల వర్షం కారణంగా సోయలో డ్యామేజ్, మట్టి రేణువులు రావడం వల్ల మార్క్ఫైడ్ సిబ్బంది రోజుకో మాటలు మాట్లాడి రైతుల సోయ కోరడం లేదన్నారు. గత ప్రభుత్వం ఎకరానికి సోయ 10 క్వింటాళ్లు కొనుగోలు చేసేది ఇప్పుడు ఎకరానికి 7.5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుందన్నారు. బిచ్కుంద రైతు వ్యవసాయ కేంద్రంలో పంటను ఆరబెట్టి తేమ శాతం వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు చూసి తూకం వేసిన తర్వాత తూకం వేసిన బస్తాలని కొనుగోలు కేంద్రంలో నిలిపి వేస్తున్నారు. ఆగ్రహించన రైతులు ఈరోజు రోడ్డు మీదికి వచ్చి సోయా కొనుగోలుపై నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై మోహన్ రెడ్డి మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి సోయ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారికి తెలియజేయడం జరిగింది. రేపు మార్క్ఫెడ్ అధికారులు వచ్చి సోయా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు.