*ఇదెక్కడి న్యాయం రా దేవుడా* *తప్పు చేసింది ఒకరైతే చర్యలు వేరేవరికోనా*?? *ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేసింది ఒకరైతే చర్యలు ఇతరులపై ఎందుకు* *మాకు న్
అక్షర విజేత షాద్నగర్.
కొన్ని రోజుల క్రితం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై కొంతమంది బీసీ సేన సభ్యులు విమర్శలు చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. దానికి గాను కాంగ్రెస్ నాయకులు నిన్న కౌంటర్ కూడా చేశారు. బీసీ ల కొరకు ఎమ్మెల్యే గారు ఒకవైపు పోరాటం చేస్తూ వాళ్లకు సపోర్ట్ చేస్తుంటే ఆయన పై విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని ఇంకోసారి ఎమ్మెల్యే పై నోరుజారితే చూస్తూ ఊరుకోం అని తెలిపారు. ఇంతవరకు బాగానే ఉన్న సదరు బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బర్కా కృష్ణ, జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీనివాస్ నియమాలు ఉల్లంగించి ఎమ్మెల్యే పై విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా బీసీ సేన కోరుకు అహో రాత్రులు కష్టపడుతూ గ్రామ గ్రామ నా తిరుగుతూ బీసీ లను చైతన్యవంతులుగా చేస్తూ బీసీ సేన కమిటీ లు వేస్తూ న్యాయంగా క్రమశిక్షణ తో పని చేస్తున్న మేకల వెంకటేష్, జివ్వు సుధాకర్, స్రవంతి వారిపై చర్యలు తీసుకోవడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయ్ ఇది ఎంతవరకు సబబు అని బీసీ నాయకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా బీసీ సేన కొరకు ఎవరు కష్టపడి పని చేస్తున్నారో తెలుసుకొని ఎవరు క్రమశిక్షణ రాహిత్య చర్యలకు పాల్పడుతున్నారని తెలుసుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు, బీసీ నాయకులు కోరుతున్నారు.