అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ల పట్టివేత
అక్షర విజేత బిచ్కుంద
కామారెడ్డి జిల్లా పోతంగల్ మంజీరా శివారు నుండి కొడిచీర గ్రామం మీదుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఉదయం ఐదు గంటలకు అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఆర్ఐ సాయిబాబా తెలిపారు. ఈ ట్రాక్టర్లను డోంగ్లి తహసీల్దార్ కార్యాలయం నందు సేఫ్ కస్టర్డ్ కొరకు ఉంచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను చీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.