*బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి పాదయాత్రగా వెళ్లిన శివ భక్తులు.*
అక్షర విజేత, ఇబ్రహీంపట్నం :-
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆరుట్ల గ్రామంలోని కోరిన కోరికలు తక్షణమే తీర్చే కొంగు బంగారం దక్షిణ కాశీగా పిలవబడే శ్రీ శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శనానికి ఇబ్రహీంపట్నం నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దర్శించుకుని శ్రీ భవాని సమేత నాగలింగేశ్వర స్వామి శివాలయంలో ఆ పరమ శివునికి అభిషేక కార్యక్రమం జరిపిన శివ భక్తులు బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ పరమశివుని భక్తి శ్రద్ధలతో నిత్యం దీపారాధన చేస్తూ ఆ బోలా శంకరుని ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర రైతులు పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయంగా మారాలని సంకల్పం తీసుకున్న మిత్రులు ముత్యాల మహేందర్, సురమోని బాబు, హనుమంతు సుదర్శన్, కాశమల్ల నర్సింగరావు, చెనమోని గోపాల్, పానుగంటి నరేందర్, పంది బుగ్గ రాములు, ముత్యాల సంతోష్, మారోజు యాదగిరి చారి, చీమల కృష్ణ యాదవ్, పాల్గొన్నారు.