విశ్వాసులకు చేరువలో కల్వరి టెంపుల్ 13 న ప్రారంభోత్సవం తాడేపల్లిగూడెం
(అక్షర విజేత)
పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో: అత్యంత ప్రతిష్టాత్మకమైన కల్వరి టెంపుల్ ప్రార్థన మందిరాన్ని తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్నట్లు కలవరి టెంపుల్ పీఆర్వో అనిల్ తెలిపారు. ఈ మందిరాన్ని 13వ తేదీన బ్రదర్ డాక్టర్ సతీష్ కుమార్ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశ్వాసులకు, సువార్తికులకు చేరువలో కల్వరి టెంపుల్ ప్రార్థన మందిరం ఉంటుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ , తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు జిల్లాలోని రాజకీయ ప్రముఖులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి సువార్త సేవకులు విదేశీ పాస్టర్లు హాజరవుతారని అనిల్ చెప్పారు.