నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలి. పి.యం. శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలె
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి గ్రామీణ విద్యార్థులకు ఆధునిక మౌలిక వసతులతో అత్యున్నత నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పి.యం. శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో వనపర్తి జిల్లాలో పి.యం.శ్రీ కింద ఎంపిక అయిన 21 ప్రభుత్వ పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు, కె.జి.బి.వి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్, ఇంజనీరింగ్ అధికారులతో పి.యం.శ్రీ పై సమీక్ష నిర్వహించారు.
విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు వనపర్తి జిల్లాలో 21 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని అదేవిధంగా జిల్లాలోని కెజిబివి లు, జూనియర్ కళాశాలలను ఎంపిక చేసి వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు పి. యం.శ్రీ ద్వారా నిధులు మంజూరించేయడం జరిగింది. 2023-24, 24-25 వరకు 13.26 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు కేవలం 7 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందని, మిగిలిన నిధులు సైతం మార్చి లోపు ఖర్చు చేయాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా ఈ సంవత్సరం జిల్లాకు రూ. 6.01కోట్ల నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు రూ. 2.00 కోట్లు మాత్రమే ఖర్చు.చేశారని చెప్పారు. వచ్చిన బడ్జెట్ నేరుగా ప్రధానోపాధ్యాయుల అకౌంట్ కు జమ చేయడం జరిగిందని, ఎస్.యం.సి ద్వారా పనులు చేయించి మార్చి, 2026 వరకు మొత్తం నిధులు ఖర్చు చేసే విధంగా చూడాలని సూచించారు అదనపు గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్, సైన్స్ ల్యాబ్, భవిత సెంటర్ ఏర్పాటు వంటి పనులకు నిధులు మంజూరు చేయడం జరిగింది. మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా బడిబాట, న్యూస్ పేపర్, మ్యాగజీన్ ల కొనుగోలు, ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, గ్రీన్ స్కూల్ కాంపిటీషన్, ఐ.ఐ.టి, ఎం.ఐ.టి ల సందర్శన , యూత్ ఇకో క్లబ్ వంటి కార్యక్రమాల నిర్వహణకు సైతం పి.యం.శ్రీ నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. వీటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు అత్యున్నత నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని అప్పుడే ఈ పథకం సార్థకమవుతుందని కలెక్టర్ వివరించారు.
ఎక్కడైనా స్థలం లేని పక్షంలో ఇతర పి.యం శ్రీ పాఠశాలకు నిధులు మళ్లించి పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు.జిల్లా విద్యా అధికారి అబ్దుల్ ఘని, టి.జి. ఇ.డబ్ల్యు.ఐ.డి.సి కార్యనిర్వహక ఇంజనీరు రామచందర్, ఎ . ఈ లు, పి.యం.శ్రీ ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ లు, జి.సి.డి. ఒ శుభాలక్మి తదితరులు పాల్గొన్నారు.