బాలవివాహ రహిత జిల్లాగా కృషి చేయాలి.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న జిల్లా బాలల పరిరక్షణ వారి ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమమును వనపర్తి జిల్లా పానుగల్ మండల కేంద్రంలో కేజీవీబీలో నిర్వహించారు సమావేశానికి జిల్లా సంక్షేమ అధికారి కే. సుధారాణి మాట్లాడుతూ వనపర్తి జిల్లాను బాలవివాహ రహిత జిల్లాగా మార్చడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అబ్బాయికి 21 సంవత్సరం తర్వాత వివాహాలు చేసుకోవాలన్నారు. ఒకవేళ అలా కాని పక్షంలో ముందుగా తల్లిదండ్రులు గాని, మిగతా ఎవరైనా చేయాలని ప్రోత్సహించిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం అందించాలని ,ఆడపిల్లలు బాల్య వివాహాలు చేసుకోవడం ద్వారా తొందరగా గర్భం దాల్చడం, రక్తహీనత, కుటుంబ వివరాల నిర్వహణ సక్రమంగా చూసుకోకపోవడం, ఆర్థికంగా వెనుకబాటుతనం, ఇవన్నీ సమస్యలు కూడా బాలవివాహాల వల్ల జరుగుతాయని వీటిని అధిగమించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు ఎదగాలని , మీ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని వృధా కాకుండా చూసుకోవాలని జిల్లా సంక్షేమాధి కే సుధారాణి తెలిపారు. దానితోపాటు సేఫ్ టచ్ అన్సెప్ట్ టచ్ బాలల న్యాయ చట్టం ఫోక్సా ఆక్ట్ 2012 వాటిపై కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం రాంబాబు , కౌన్సిలర్ స్వరూప గారు, జెండర్ స్పెషలిస్ట్ సలోమి , ఆర్డీఎస్టీ మెంబర్ రాజశేఖర్, కేజీబీవీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.