పెద్ద శంకరంపేట మండల విద్యుత్ ఏఈగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరణ
అక్షర విజేత పెద్ద శంకరంపేట్
పెద్ద శంకరంపేట: పెద్ద శంకరంపేట మండలానికి నూతన విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇదే మండలంలో ఏఈగా సేవలు అందించిన ఆయన, పాపాన్నపేట ఏఈగా పనిచేసి మళ్ళీ తిరిగి పెద్ద శంకరంపేటకు బదిలీ కావడం జరిగింది. ప్రాంతీయ ప్రజలకు అప్పటికే పరిచయం ఉన్న అధికారి కావడంతో ప్రజలు, గ్రామ ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మండల పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, లైన్ల అప్‌గ్రేడేషన్, ట్రాన్స్ఫార్మర్ నిర్వహణ, తక్షణ స్పందనతో సమస్యల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలతో సమన్వయంగా ముందుకు సాగుతామని చంద్రశేఖర్ తెలిపారు. విద్యుత్ సంబంధిత ఏ విధమైన సమస్యలు ఉన్నా కార్యాలయానికి వచ్చి నేరుగా కలవొచ్చని, ప్రజల అవగాహనతో సమస్యలను త్వరగా పరిష్కరించగలమని ఆయన పేర్కొన్నారు. మండల పరిధిలో సిబ్బంది, లైన్మెన్లు, గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని ఏఈ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏడీఈ మోహన్ బాబు విద్యుత్ సిబ్బంది ఉన్నారు