*రేపటి నుండి సి . సి.ఐ ద్వారా ప్రత్తి కొనుగోళ్లు, రేపు ఉదయం సి .సి .ఐప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న నేతలు* *యర్డు చైర్మన్ షేక్ కరీ
చిలకలూరిపేట నియోజక వర్గం అక్షర విజేత
చిలకలూరిపేటనియోజకవర్గ పరిధిలోని ప్రత్తి పండించిన రైతాంగానికి గిట్టుబాటు ధరలను అందించే కార్యక్రమంలో భాగంగా, బుధవారం ఉదయం 10.30 గంటలకు సి సి ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవి కుమార్,పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు,మాజీ మంత్రి వర్యులు,స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించనున్నారని వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరీముల్లా తెలిపారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని వెంకట కృష్ణా ఎంటర్ప్రైజెస్ కంపెనీ యందు సదరు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నామని వారు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రత్తి రైతులను దృష్టిలో ఉంచుకుని మరో కొనుగోలు కేంద్రాన్ని కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని వారు తెలిపారు. అలాగే కనీస మద్దతు ధర క్వింటాలుకు 8,110/- చొప్పున కొనుగోలు చేయడం జరుగుతుందని, సి సి ఐ కొనుగోలు కేంద్రాలలో ప్రత్తిని అమ్మదలచుకున్న రైతులు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలలో ఆధార్,పట్టదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీలు అందించి *కపాస్ కిసాన్ యాప్* నందు స్లాట్ బుక్ చేసుకున్న అనంతరం ప్రత్తిని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని వారు తెలిపారు. దళారుల చేతిలో మోసపోకుండా, ప్రతి ఒక్క రైతు తమ పంటను సి సి ఐ కొనుగోలు కేంద్రాల ద్వారా మంచి ధరకు విక్రయించుకోవాలని ఈ సందర్భంగా యార్డు చైర్మన్ షేక్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వర రావు, యార్డు కార్యదర్శి తిరుపతి రాయుడు రైతులకుఈ తెలియజేశారు.