నిజామాబాద్ లో మోటార్ వెహికిల్ అమెండ్ మెంట్ యాక్టు 2019 అమలు
అక్షర విజేత,
నిజామాబాద్ ప్రతినిధి : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మోటార్ వెహికిల్ అమెండ్ మెంట్ యాక్టు 2019 అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ఇది వరకు 1988 మోటార్ వెహికల్ యాక్టు 185 సెక్షన్ ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మొదటిసారి రూ.2 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉండేదని ఒక్కోసారి రెండు కూడా అమలు చేసినట్లు తెలిపారు. మొదటిసారి పట్టుబడిన తర్వాత మూడేళ్ళలో మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే రూ.3 వేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించారని కానీ కొత్తగా 2019 మోటార్ వెహికల్ అమెండ్ మెంట్ యాక్టు ప్రకారం కొత్త శిక్షలు అమలవుతాయని తెలిపారు. ఈ యాక్టు ప్రకారం మొదటిసారి పట్టుబడిన రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారని, ఒక్కోసారి రెండు కూడా విధించే అవకాశం ఉందన్నారు. కొత్త యాక్టు ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మొదటిసారి తర్వాత మూడేళ్ళలో మరోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తారని తెలిపారు. ఒక్కోసారి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని తెలిపారు.