*కంగ్టి లో ప్రజలు లేని ప్రజా దర్బార్* *తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ,* *ప్రజల భాగస్వామ్యం లేని ప్రజావేదిక*
అక్షర విజేత,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం15వ విడత సామాజిక తనిఖీని ఎంపిడిఓ సత్తయ్య అధ్యక్షతన నిర్వహించరు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ప్రజల భాగస్వామ్యం లేకుండానే అధికారులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు డిఆర్డిఓ బాలరాజు,జిల్లా విజిలెన్స్ అధికారి నాగేశ్వరరావు, హాజరయ్యారు.మండలంలో 33 గ్రామ పంచాయతీల పరిధిలో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు నిర్వహించిన ఉపాధి హామీ పనుల పై సామాజిక తనిఖీ నిర్వహించారు.ప్రజావేదికలో ప్రజలు లేకుండానే ప్రజా దర్బార్ కొనసాగింది. ప్రజావేదికలో అసలే ప్రజలు పాల్గొనలేరు. కేవలం అధికారులు, ఉద్యోగులు మాత్రమే సమీక్ష సమావేశంల నిర్వహించారు. అధికారులే ప్రశ్నించడం, మళ్ళీ వాళ్ళే సంజాయించడం, జరిగింది.పనికితగ్గ కూలీలు రాలేదని, పనులు జరుగకున్న బిల్లులు డ్రా చేశారని, ఒకరికి బదులుగా మరొక్కరు పనిచేశారని ప్రశ్నించేవారే కాన రాకుండా పోయారు.ఈ విధంగా కేవలం అధికారులు, ఉద్యోగులు మాత్రమే సామాజిక తనిఖీలు నిర్వహించుకుంటే తప్పిద్దాలు ఎలా బయటపడతాయని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి హామీ అంబుడ్స్మన్ భోజిరెడ్డి, ఏపిడి రాజు,సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి కొమురయ్య,11మంది డిఆర్పిలు,ఏపీవో నర్సింలు,టెక్నికల్ అసిస్టెంట్లు,పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు,అధికారులు పాల్గొన్నారు.