దళిత ఎస్సై పై మంత్రి జూపల్లి పిఏ పెత్తనం వనపర్తి ఎస్పీకి తెలియకుండానే ఎస్ఐ బదిలీ . చిన్నంబావి ఎస్సై జగన్మోహన్ ఆకస్మిక బదిలీపై అనుమానాలు.* దళి
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ప్రజా భద్రత కోసం పనిచేస్తున్న పోలీస్ శాఖ పైన ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ జులూమ్ పెత్తనం చలాయిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి వనపర్తి జిల్లా లోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల చిన్నంబాయి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పని చేస్తున్న దళిత ఎస్సై జగన్మోహన్ ఆకస్మికంగా వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేయడం పట్ల సత్వర విమర్శలు వినిపిస్తున్నాయి . వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వృత్తి తన బాధ్యతలను నిర్వర్తిస్తూ జిల్లాలోని 15 పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐలను మూడు సర్కిల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిఐ లను ఒక డిఎస్పి ని ఎప్పటికప్పుడు విధి నిర్వహణలో బాధ్యతగా నిబంధనలతో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు మంచి చేయాలని తన సిబ్బందిని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టకుండా డ్యూటీలను చేయించుకుంటున్న సందర్భంలో ఆకస్మికంగా జిల్లా ఎస్పీకి తెలవకుండా రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సమాచారం లేకుండా మంత్రి జూపల్లి పిఏ చిన్నంబాయి ఎస్సై జగన్మోహన్ నో అక్కడ్నుంచి జిల్లా ఎస్పీకి బదిలీ చేయడం పట్ల పలు అనుమానాలు దారితీస్తున్నాయి. నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్న దళిత జగన్మోహన్ ఎస్సై పై మంత్రి జూపల్లి పిఏ పెత్తనం దళిత జాతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు దళిత కుటుంబంలో జన్మించిన ఎస్సై జగన్మోహన్ నిజాయితీతో నిబంధనతో తనదైన శైలిలో ఎవరికి తొత్తుగా పనిచేయకుండా ఉన్నది ఉన్నట్లు పనిచేస్తున్న సందర్భంలో కొల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని చిన్నంబాయి మండలంలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా ఇసుక మాఫియాను అడ్డుకట్ట వేసిన ఎస్సై పై మంత్రి ప్రమేయం లేకుండా మంత్రికి సమాచారం ఇవ్వకుండా నేరుగా మంత్రి పిఏ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు ఒక ఫోన్ కాల్ చేసి అక్కడ పనిచేస్తున్న జగన్మోహన్ ఎస్ఐ ని వనపర్తి డి సి ఆర్ పి కి బదిలీ చేయడం పట్ల నిజాయితీగా పనిచేస్తున్న పోలీస్ అధికారులు విశ్వాసం కోల్పోతూ విధి నిర్వహణలో అంతుచిక్కని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. ఈ తతంగం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ కూడా బహిర్గతం కాకపోయినా కూడా ప్రజా ప్రతిభ దినపత్రికకు అందిన సమాచారం మేరకు వనపర్తి జిల్లా పరిధిలోని చిన్నంబాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ బదిలీ పైన ప్రజల్లో ముఖ్యంగా దళిత సంఘాలలో ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ఎక్కడ పనిచేసిన కూడా ఎస్సై జగన్మోహన్ తన విధి నిర్వహణ కర్తవ్యాన్ని బాధ్యతను విస్మరించకుండా కఠోరంగా పనిచేయడం వల్లనే బదిలీ జరుగుతుందని దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో గద్వాల జోగులాంబ జిల్లాలోని ఉండవల్లిలో పనిచేసిన కూడా అక్కడ కూడా ఆయన అవినీతిపై ఉక్కుపాదం మోపి అక్కడ కూడా కొంతకాలం పని చేశారని తిరిగి చిన్నంబాయి మండలం వస్తే అక్కడ కూడా ఇసుక మాఫియాను అడ్డుకట్ట వేస్తే అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రి ప్రమేయం లేకుండా ఒక పిఏ ఆయన బదిలీ విషయంలో పెత్తనం చెలాయించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. దీనిపైన అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానం చెప్పాలని వనపర్తి జిల్లాలోని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజాయితీగల పోలీసు అధికారుల పైన అధికార కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో బదిలీలు సస్పెండ్ బెదిరింపులు, రకరకాల వేధింపులకు గురి చేస్తుందని అందులో భాగంగానే పోలీస్ శాఖ పైన టార్గెట్ చేసుకొని చెప్పిన మాట వినకుంటే మీ ఉద్యోగం ఊడిపోతుందని భయపెట్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక మాఫియా విషయంలో ఇతర మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, హత్యలు అత్యాచారాలు, కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న కూడా పోలీస్ శాఖ పట్టించుకోకపోవడానికి కారణం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను బెదిరిస్తూ పని చేయకుండా బానిసలుగా వాడుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కొల్లాపూర్ నియోజక వర్గంలో చిన్నంబాయి మండలంలోని లక్ష్మీ పల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన బొడ్డు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని 2023 మే నెల లో ఇంటిముందు నిద్రిస్తున్న సమయంలో ధారణంగా హత్య చేసిన విషయంలో ఎందుకు నిందితులను అరెస్టు చేయలేదని ప్రశ్నలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నంత మాత్రాన హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేయకుండా చివరకు పోలీసులను కూడా భయపెట్టిస్తూ వృత్తి ధర్మాన్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ నేరస్తులను కప్పిపుచ్చుకుంటున్న అధికార పార్టీ పైన పోలీస్ శాఖలో ఇతర ప్రతిపక్ష పార్టీల్లో ప్రజాసంఘాల నాయకులలో పాలు అనుమానాలకు దారితీస్తుంది. వనపర్తి జిల్లాలో పోలీస్ శాఖ లో పనిచేస్తున్న సిబ్బంది పైన అధికార పార్టీ పెత్తనం మానుకోవాలని లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం శాశ్వతం కాదు జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు.