ఆటో బైక్ ను ఢీకొనడంతో ఒకరు మృతి మరొకరికి గాయాలు ==కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ==చనిపోయిన వ్యక్తికి నలుగురు కూ
అక్షర విజేత ఏదుల;
వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోని అనంతపురం గ్రామానికి చెందిన బోయ రాములు (50) తన మూడవ శిరీష (18) తో కలిసి తన బైకు TS 32 C 6441 పై ఎక్కించుకొని అనంతపురం గ్రామంలో నుండి వనపర్తికి షాపింగ్ కి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న గా సాయంత్రం అందాల 7 గంటలకు చెన్నారం గ్రామం టర్నింగ్ దగ్గర వారికి గోపాల్పేట మండలం పరిధిలోని అప్పయిపల్లి గ్రామానికి చెందిన ఆటో TS 32 T 0376 లో ఏదుల మండల కేంద్రం నుండి పాలకేన్లు వేసుకొని అతివేగంగా, ఆ జాగ్రత్తగా రాములు బైకు డి కొనడంతో రాముడు తలకు కుడి కాలికి, అలాగే శిరీష కుడి కాలికి బలమైన గాయాలు కాగా నిమ్స్ ఆస్పత్రి, హైదరాబాద్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 8:40 నిమిషాలు కు రాములు మృతి చెందాడని భార్య తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తికి నలుగురు కూతుర్లు, ఒక కొడుకు సంతానం ఉన్నారని వారు తెలిపారు.