ప్రెస్ క్లబ్ సహకారం హర్షనీయం హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం
(అక్షర విజేత)
పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో: తాడేపల్లిగూడెం పాత్రికేయుల సంఘం రెండు సంవత్సరాలుగా తమకు అందించిన సహకారం హర్షనీయమని తాడేపల్లిగూడెం హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మిశెట్టి రంగ సురేష్ ను ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆయన సత్కరించారు. మూడోసారి పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయం అన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో వ్యాపారులకు మీడియా మిత్రులకు మధ్య అనుబంధం కొనసాగటం సంతోషంగా ఉందన్నారు. తమ అసోసియేషన్‌కు మీడియా మిత్రులతో స్నేహపూర్వక వాతావరణం లో ఉంటూ అనుబంధం కొనసాగిస్తున్న ఇప్పుటి పాలకవర్గం మరింత కాలం సేవలందించడం వ్యాపారులకు శుభ పరిణామం అని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగ సురేష్ మాట్లాడుతూ వర్తక వ్యాపారాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నామని సహృద్భావ వాతావరణంలో ఈ బంధం మరి కొంతకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సుందరనీడి లక్ష్మయ్య, హాయ్ మేకింగ్ కార్యదర్శి సరికొండ రవికుమార్ రాజు, బూర్గుల భాను శ్రీనివాస్, ఆకుల రాంప్రసాద్, దేవ శివప్రసాద్, హోటల్స్ అసోసియేషన్ కార్యదర్శి మేడిశెట్టి చైతన్య, కోశాధికారి ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు.