*ఐటీ పార్క్ భూములపై రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలి: నడికూడ శివ*
*అక్షర విజేత మహేశ్వరం*
మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని ఐటీ పార్క్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మహేశ్వరం నియోజకవర్గం ఐఎన్ టీయూసి కార్మిక శాఖ అధ్యక్షుడు నడికూడ శివ డిమాండ్ చేశారు. కందుకూరు ఆర్డీవో సమక్షంలో జరిగిన రైతుల సమావేశంలో మాట్లాడుతూ, “రైతుల కష్టార్జిత భూములు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం తీసుకుంటున్నప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. రైతులకు న్యాయమైన పరిహారం అందే వరకు పోరాటం కొనసాగుతుంది” అన్నారు. రైతుల హక్కులను కాపాడడానికి ఐఎన్ టీయూసి ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను ఆర్డీవోకు వివరించారు.