14 వ వార్డులో నీటి సమస్య తీర్చండి సారు... నాలుగు నెలలుగా నీరు లేక ఇబ్బందులు పడుతున్నాం
అక్షర విజేత బిచ్కుంద
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రంలోని 14వార్డులో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం మోటారు రిపేరు అయిందని ఇప్పటివరకు బాగు చేయించలేదని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. నీటి సమస్య తీర్చకపోతే, నీటి బిందెలతో మున్సిపల్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తామని వారు తెలిపారు.