*అధికారుల కనుసన్నల్లో అక్రమ నిర్మాణలు..నాగారం లో అక్రమ నిర్మాణలకు అంతం లేదా...* --- ఫిర్యాదు చేసినా,జగన్మోహనరెడ్డి, సుధాకర్ రెడ్డి.. --- నాగారం మున్
*అక్షర విజేత, కీసర నాగారం*
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో రాంపల్లి మెయిన్ రోడ్డు గుండా నిబంధనలకు విరుద్ధంగా కమర్షైల్ రేకుల షెడ్లు నిర్మాణాలు జరుగుతున్నా నాగారం మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నిరెత్తనట్టుగా ప్రవర్తిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొనేదెప్పుడు అని నాగారం మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. నాగారం లో సర్వే నంబర్ 360 లో ప్లాట్ నెంబర్ 44 వెంకటేశ్వర కాలనీ లో పురాతన బావి లో మున్సిపాలిటీ నిబంధనలకు సెట్ బ్యాక్ లేకుండా బిల్డర్లు ఇంటి నిర్మాణలు చేస్తూ వినియోగదారులను మోసం చేస్తూ అలాగే నాగారం రాంపల్లి పరిధిలో బిల్డర్ ఇంటి నిర్మాణం లో బాగంగా సంపు, సెప్టిక్ ట్యాంక్ రోడ్డులో నిర్మించారు. ఇలా అనేక రకాలుగా మున్సిపాలిటీ లో నిబంధనలకు విరుద్ధంగా, అక్రమ,నిర్మాణాలు కోకొల్లలు గా వెలుస్తున్నాయి.ఇటీవలి కాలంలో మాజీ ప్రజాప్రతినిధులు అనేకమార్లు అక్రమ నిర్మాణల పై ప్రజా వాణి లో కంప్లైంట్ చేసినా చర్యలు శూన్యమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే పత్రికలలో నిత్యం అక్రమ నిర్మాణల పై మున్సిపాలిటీ టిపిఓ శ్రీదేవి,మరియు చైన్మెన్ల పై వార్తలు వస్తున్నా కమిషనర్ స్పందించక పోవడంపై లంచాలు దండిగా అందుతున్నాయా అని వాపివాల్సివస్తుంది. సరైనా రీతిలో పేద, మధ్య తరగతి ప్రజలపై మాత్రమే ఇంటి పన్ను చెల్లింపులు వడ్డీలపై వడ్డీలు వేస్తూ బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. అని నాగారం మున్సిపాలిటీ ప్రజలు అడుగుతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాల పై పైస్థాయి లో విచారణ జరగాల్సిన అవసరం ఉందని మున్సిపాలిటీ ప్రజలు,ప్రజాప్రతినిధులు,పత్రికలు విన్నపాలు చేస్తున్నారు.