*అక్రమ వెంచర్.. అడ్డగోలు అమ్మకాలు* *గత గ్రామపంచాయతీ నాలా పర్మిషన్.* *జిపి లేఅవుట్ నాలా లేకుండా అమ్మకాలు.* *పెద్దమనుషులుగా చలామణి అవుతూ అక్రమ అమ
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి..
వనపర్తి జిల్లా:అమరచింత మున్సిపాలిటీ మండల కేంద్రం, అనుమతుల్లేని వెంచర్లు, రియల్టర్లు ప్రజలను, ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. అక్రమ వెంచర్లు.. అడ్డగోలు అమ్మకాలు సర్కారుకు పన్ను ఎగ్గొడుతున్నారు.
అలాగే అనుమతుల్లేని ప్లాట్లు అంటగడుతూ కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నారు.
అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో సర్వేనెంబర్ 580.581 లో కొందరు పట్టణ పెద్దమనుషులుగా చలామణి అవుతూ ఎలాంటి అధికారిక యధాచగా రాళ్లు పాతి ప్లాట్లు చేసి అనుమతులు లేని ప్లాట్లు అంట కడుతూ. కొనుగోలుదారులకు బురడీ కొట్టిస్తున్న పెద్దమనుషులు.
*మున్సిపల్ కమిషనర్ నాగరాజు వివరణ.*
మొన్న వచ్చిన పత్రిక ప్రకటన అవాస్తవం
అమరచింత పట్టణంలో సర్వేనెంబర్ 580. 581 వ్యవసాయ భూమిలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు జిపి పర్మిషన్తో ఎలాంటి నాలా పర్మిషన్లు లేకుండా ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చాయని మున్సిపల్ కమిషనర్ నాగరాజు వివరణ ఇచ్చారు 580 581 సర్వే నెంబర్లు జరుగుతున్నాయని 10 శాతం ప్లాట్ లో విక్రయాన జరుగుతుందని కొందరు ఈ సందర్భంగా తెలిపారు అప్పట్లో కేటాయించిన 10% గుర్తించాల్సి ఉందని ఈ రెండు మూడు రోజుల్లో టౌన్ ప్లానర్ తో సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని మొన్న వచ్చిన ఒక పత్రిక ప్రకటనలో ఎలాంటి నిజం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తప్పుడు వార్తలు ప్రచురించడం సరైనది కాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు