దెబ్బతిన్న నాగపూర్ రోడ్డుకు తక్షణ మరమ్మతులు ==ఎమ్మెల్యే సహకారంతో మరమ్మత్తులు చేయిస్తున్న కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో చైర్మన్ రఘు యాదవ్
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి:
గత రోజుల నుండి ఎడతెరిపిలేని వర్షాలకు వచ్చిన భారీ వరదలతో రేవల్లి మండల పరిధిలోని పలు రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లు, బ్రిడ్జిలపై వాగులు ఉప్పొం గడంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. రాకపోకల కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో బుధవారం రేవల్లి నుండి నాగపూర్ గ్రామం మినగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బ తినడంతో వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంతో కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో చైర్మన్ రఘు యాదవ్ రోడ్లకు తాత్కాలికం మరమ్మత్తులు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.