మతోన్మాదం ప్రగతికి ప్రమాదకరం.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి
దేశంలో మతోన్మాదం పెరగటం దేశ ప్రగతికి ఆటంకమని వామపక్ష ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. వనపర్తి సిపిఐ కార్యాలయంలో కవిజనజ్వాల రాధాకృష్ణ రచించిన 'జనజ్వాల మహా కవిత్వం'పుస్తకాన్ని భారత విప్లవోద్యమ నిర్మాత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జే రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు జనజ్వాల రాధాకృష్ణ, డా. భగవంతు, కొంకల నారాయణ, గణేష్, కేశవులు, వెంకటేష్, మోష తదితరులు మాట్లాడుతూ.. పాలకులు దేశంలో మతాన్ని పెంచిపోషిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల్లో మతాన్ని ఎక్కించి సమస్యలపై పోరాడకుండాపక్క దారి పట్టిస్తున్నారు. వామపక్ష భావజాలమే దేశంలో ఉండే 90% మంది పేదలు ఎస్సీ,ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తుంది అన్నారు. పార్టీలకతీతంగా వామపక్ష భావజాలం గల వారందరూ ఐక్యమై పోరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా చైతన్యానికి ప్రతిబంధకంగా పరిణమించే మతం కులం జాతి వివక్షతను ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఐక్యమైపోనాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రజాహక్కులను వామపక్షాలు మాత్రమే కాపాడగలవన్నారు. వాపక్షవాదులందరూ సంఘటితం కావలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. శ్రీరామ్, గోపాలకృష్ణ శ్రీహరి రవిచంద్ర సంఘ రక్షిత కుతుబ్ అరవిందు తదితరులు పాల్గొన్నారు.