*శివరాంపల్లి లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు* *తెల్లవారుజాము నుండి భారీ ఎత్తున భక్తుల సంఖ్య* *ఆలయ అర్చకులు హరి కీర్తి శివరామ ప్రసాద్ శర్మ*
*అక్షర విజేత రాజేంద్రనగర్*
కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లి పరిధిలోని హనుమాన్ దేవాలయంలో భక్తులు కిటకిటలాడాయి.
తెల్లవారుజామున నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరి కీర్తి శివరామ ప్రసాద్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ 2002 సంవత్సరంలో పూర్వం నుంచి పురాతనమైనది ఆంజనేయస్వామి ఇక్కడ విరజిల్లుతున్నారని చెప్పుకొచ్చారు. శిథిలావస్థలో ఉన్న గుడిని గ్రామ పెద్దలు ప్రజా పొదుపు సంఘం ప్రజలు కలిసి పునర్మించారు. రాజేంద్రనగర్ సర్కిల్ లోని మొట్టమొదటిగా అయ్యప్ప స్వామి గుడి ప్రతిష్టాపన ఈ ప్రాంతంలోనే జరిగిందని అందువలన ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు దూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ అయ్యప్ప మాల ధరిస్తారని చెప్పుకొచ్చారు.. ఈరోజు హనుమాన్ ఆలయంలో చిన్నారులు భరత నాట్యం చేస్తూ వచ్చిన భక్తులను సంతోషపరచుతూ అలాగే మహిళలు కార్తీక దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు జరిపి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ప్రాధాన్యతను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.