పత్తి రైతు చిత్తూ
అక్షర విజేత ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి
పత్తి రైతుల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్న CCI అవలంబిస్తున్న దుర్మార్గపు విధానం మీద ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ లో పత్తి మీద ఇప్పటి వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని పూర్తిగా తీసేయడం వలన భారీ మొత్తం లో విదేశి పత్తిని మన దేశీయ వ్యాపారులు కొనుగోలు చేశారు దీని వలనే దేశీయ పత్తికి పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది,ఆ కారణం చేతనే CCI పత్తి కొనుగోళ్లలో ఇన్ని అడ్డంకులు సృష్టిస్తుంది.ఇప్పటికీ యూరియా సరఫరా లో అడ్డంకులు సృష్టించిన కేంద్రం విధానం వలన రైతులు ఇతర కాంప్లెక్స్ ఎరువులు వాడడం వలన పంట పెట్టుబడి విపరీతంగా పెరిగింది.అకాల వర్షాల వలన ఈ సంవత్సరం పంట దిగుబడి పూర్తిగా పడిపోయింది దీనికి తోడు CCI అడ్డగోలు అడ్డంకుల వలన రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది అని CCI వైఖరి మార్చుకొని మునుపటి విధానంలోనే పత్తి కొనుగోళ్లు చేయాలి అని లేకపోతే రైతుల నుండి తీవ్ర ఉద్యమం తప్పదని తెలియజేశాం.ఈ కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజక వర్గ అధ్యక్షులు ఇనుకొండ కమల్ నాథ్ రెడ్డి,ఖైర్గాం మాజీ సర్పంచ్ మానేం కార్తీక్,కొమురవెల్లి మాజీ సర్పంచ్ పెద్దింటి శ్రీకాంత్, యువజన కాంగ్రెస్ ఆసిఫాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఎలగల సాయికుమార్ మరియు సంద అనిల్ పాల్గొన్నారు.