ఆటలతోనే విద్యార్థులకు మానసిక ఆరోగ్యం.... స్కూల్ గేమ్స్ ను ప్రారంభించిన ఎస్ఐ చల్ల రాజు.....
అక్షర విజేత,వెంకటాపూర్, (రామప్ప)
వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామం లోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు మంగళవారం రోజున ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని వెంకటాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆప్ పోలీస్ చల్ల రాజు ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంబించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా ముందుకు రావాలని, క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు.క్రీడా స్పూర్తి ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన పెరుగుతుందని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులు మత్తు పదార్దాలకు దూరంగా ఉండాలని,తాము ఎంచుకున్న క్రీడల్లో ఉత్తమ ప్రతిభ ను కనబర్చాలని,విద్యార్థులకు సూచించాడు. ఈ కార్యక్రమ లో ఉపాధ్యాయులు మరియు క్రీడాకారులైన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.