గోపాల్ పేట నూతన మండల విద్యాధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్ చంద్రశేఖర్ ==మండలంలోని విద్యాభివృద్ధికి కృషి చేస్తాను
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి లోని గోపాల్పేట మండలానికి నూతన ఎంఈఓ గా వనపర్తి జెడ్పిహెచ్ఎస్ హరిజనవాడ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్. చంద్రశేఖర్ మంగళవారం రోజు స్థానిక ఎంఆర్సి కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఏదుల మండల ఎంఈఓ శ్రీ ప్రభాకర్ ఇప్పటివరకు గోపాల్పేట మండలానికి ఇన్చార్జిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన మండల విద్యాధికారి గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలలను పర్యవేక్షిస్తూ నా దృష్టికి వచ్చిన సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. అందులో భాగంగా విద్యార్థుల అభివృద్ధి కోసం, పాఠశాలలో నెలకొన్న సమస్యల కోసం, ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత కోసం తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా భోజన విరామ సమయంలో నూతన ఎంఈఓగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్ చంద్రశేఖర్ ని ఘనంగా సన్మానించారు. అలాగే ఇప్పటివరకు పనిచేసి తమ సేవలు అందించిన మాజీ ఎంఈఓ ప్రభాకర్ ని కూడా ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ ప్రభాకర్ , జిల్లా పరీక్షల అధికారి గణేష్ కుమార్ , అసిస్టెంట్ డి సి ఈ బి సెక్రెటరీ శ్రీనివాసరావు , మాజీ ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ , ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.