*ఆకాశానికి తాకేలా అక్రమ భవనం* *ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా భవనం నిర్మిస్తున్న బిల్డర్*
*అక్షర విజేత రాజేంద్రనగర్*
గండిపేట్ మండలం మణికొండ మున్సివల్ పరిధి పుప్పాలగూడ లో టి.ఎస్.బి.పాస్,కు పంగనామాలు పెడుతూ ఓ బిల్డర్ తన ఇష్టానుసారంగా ఆకాశానికి తాకేలా భారీ భవన నిర్మాణం ఎధేచ్చగా జరుపుతున్నాడు, మున్సిపల్ నుండి అనుమతులు పొందింది ఒకేత్తయితే, నిర్మాణం మరో ఎత్తు నిర్మిస్తున్నాడు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతూ అధికారులకు నవాల్ వినురుతూ తన ఇష్టానుసారంగా భవన నిర్మాణాన్ని నిర్మిస్తున్నాడని స్థానికులు చెప్పుకొచ్చారు. తక్షణమే ఈ భవన నిర్మాణంపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే భవన నిర్మాణాన్ని చేపట్టేలా అధికారులు కట్టడి చేయాలని కోరుతున్నారు.