విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు.. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి డిమాండ్. వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన ఎస్ఎఫ్ఐ.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెంట్, మరియు స్కాలర్షిప్స్ గత ఆరు ఏళ్ల నుండి ప్రభుత్వం చెల్లించడం లేదని 2023 నుంచి 2026 వరకు 6,300 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజులు. అలాగే గత ప్రభుత్వాహయంలో 4100 కోట్లు బకాయిలు ఉన్నాయని మొత్తం 10,500 కోట్లు బకాయిలు ఉన్నాయని వీటిలో దసరా కంటే ముందు ప్రభుత్వం యాజమాన్యాలు సమ్మె సందర్భంగా చర్చలు జరిపి దసరాకు 300 కోట్లు, దీపావళి 900 కోట్లు, మొత్తం 1200 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి వాటిలో కేవలం 300 కోట్లు చెల్లించారని మిగతా బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గమని అన్నారు. విద్యార్థులను పై చదువులకు వెళ్ళనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు.ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇంకో పక్క ప్రైవేట్ యాజమాన్యాలు కూడా వారి ఇబ్బందులు రీత్యా సమ్మెలోకి వెళ్లడం జరిగిందని ఇలాంటి దుర్మార్గమైన పాలన కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని లేనియెడల ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే పి ఏ కి వినతి పత్రాన్ని అందించారు ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వీరన్న నాయక్, ఆంజనేయులు, ఆర్.ఈశ్వర్, సాయి,ఈశ్వర్ నాయక్, శివ,రమేష్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు._