పేసా మొబైలైజర్, మరణం పట్ల విషాదం.
అక్షర విజేత,ఆదిలాబాద్ జిల్లా బ్యూరో.
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలము బలన్పూర్ గ్రామానికి చెందిన గేడం రవి పేసా మొబైలైజర్, గిర్నూర్ గ్రామపంచాయతీ, దురదృష్టవశాత్తు హఠాత్తుగా మరణించిన, సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
వివరాల్లోకి వెళితే — గేడం రవి గిర్నూర్ జీపీ పరిధిలో పేసా మొబైలైజర్గా కృషి చేస్తూ, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆయన పేసా హక్కుల అవగాహన, గ్రామసభ బలోపేతం, ఆదివాసీ హక్కుల పరిరక్షణలో ఎంతో చురుకైన పాత్ర పోషించారు.
ఆయన స్వగ్రామమైన బలన్పూర్ లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా శారీరక అస్వస్థతకు గురై, ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటన విని కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు షాక్కు గురయ్యారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, పేసా సిబ్బంది, ఆదివాసీ సంఘాల నాయకులు రవి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. గేడం రవి మరణం ఆదివాసీ సమాజానికి తీరని లోటుగా పలువురు పేర్కొన్నారు.
రవి ఎల్లప్పుడూ నవ్వుతూ, సేవా మానసికతతో ముందుండేవారు. ఆయన కృషి ఆదివాసీ యువతకు ప్రేరణగా నిలుస్తుంది.
ఆయన కుటుంబానికి ఆదిలాబాద్ జిల్లా పేసా సిబ్బంది, గ్రామసభ నాయకులు సంతాపం తెలియజేశారు.
గేడం రవి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.