కొనసాగుతున్న వినియోగదారుల విద్యుత్ సదస్సు
అక్షర విజేత మెదక్
పాపన్నపేట్
మండల పరిధిలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల సదస్సు ప్రారంభమై కొనసాగుతోంది. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో విద్యుత్ వినియోగదారులు హాజరై తమ సమస్యలను అధికారులు ముందుకు తీసుకువచ్చారు.
సదస్సు ప్రారంభంలో సబ్ ఇంజనీర్ శంకర్ మాట్లాడుతూ, వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. బిల్లింగ్ లోపాలు, మీటర్ రీడింగ్ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ లోపాలు, తక్కువ వోల్టేజ్, స్తంభాల మార్పు వంటి అంశాలపై ప్రజలు ప్రశ్నలు అడగగా అధికారులు ప్రతీ అంశంపై సమగ్రంగా స్పందించారు.
వినియోగదారుల సూచనల ఆధారంగా శాఖ సేవలను మరింత మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. ప్రజలతో నేరుగా చర్చించడం ద్వారా సమస్యలను వేగంగా పరిష్కరించగలమని తెలిపారు. ఈ సదస్సులో పాపన్నపేట ఏఈ నర్సింలు, టేక్మల్ ఏఈ ఉదయ్ భాస్కర్, అల్లాదుర్గం ఏఈ మహమ్మద్ నవాజ్, పాపన్నపేట సబ్ ఇంజనీర్ సాయికుమార్
విద్యుత్ వినియోదారులు పాల్గొన్నారు