బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో రేవల్లి ఎమ్మార్వో కు వినతి పత్రం ==ముఖ్య అతిథులుగా వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి గౌండ్ల ఎల్లస్వామి
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని బీసీ రిజర్వేషన్ సాధన సమితి పిలుపుమేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ,జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రేవల్లి మండల తహసిల్దార్ లక్ష్మీదేవికి వినతి పత్రం అందజేయడం జరిగిందని. నాయకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 42 శాతం బీసీ విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థలు రిజర్వేషన్ బిల్లులు 9వ షెడ్యూల్ చేర్పు అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు గురించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రేవల్లి మండల అధ్యక్షులు బైండ్ల ఎల్ల స్వామి, రేవల్లి మండల కోశాధికారి గురుగల కుర్మయ్య, తలపునూరు గ్రామ ఉపాధ్యక్షులు వడ్డేమాన్ సుల్తాన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఇన్చార్జ్ వాడల కురుమన్న, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.