మృతుని కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
నాగపూర్ గ్రామానికి చెందిన కిల్లే నిరంజన్ అనే వ్యక్తి శుక్రవారం అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం తెలిసిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి మృతుని కుటుంబ నికి సంతాపం తెలుపుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిరంజన్ అంతిమక్రియల నిమిత్తం అతని కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం అందించరు.ఈ ఆర్థిక సహాయం ను గ్రామ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కుర్మయ్య మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి సామాజిక సేవ దృక్పధం తో రేవల్లి మండలం లో మృతి చెందిన వారి కుటుంబ లకు 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేయానున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమం లో నాగం ప్రతాప్ రెడ్డి,మాజీ సర్పంచ్ పాపులు,చంద్రయ్య, వెంకటేష్, రామకృష్ణ, బి ఆర్ ఎస్ నాయకులు. గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.