*20 నెలల్లో రూ.55వేలకోట్ల పింఛన్లు అందించిన ఘనత చంద్రబాబుదే : మాజీమంత్రి ప్రత్తిపాటి.*
చిలకలూరిపేట నియోజక వర్గం అక్షర విజేత
* ఆర్థిక ఇబ్బందులున్నా.. ఆదాయం లేకున్నా ప్రజాసంక్షేమం..సంతోషమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు.
* రాష్ట్రాన్ని పెనువిపత్తు కబళించినా.. తీవ్ర నష్టం జరిగినా పింఛన్ల పండుగ ఆగలేదు
* దేశంలో ఏ నాయకుడికి లేని పేరు..ప్రతిష్ఠలు, విశ్వసనీయత చంద్రబాబుకు ఉండటం ప్రజలకు, రాష్ట్రానికి గర్వకారణం
* ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి.
కూటమిప్రభుత్వం ప్రజల సంతోషం, సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తోందో చెప్పడానికి పింఛన్ల పంపిణీయే నిదర్శనమని, కేవలం 20 నెలల్లో రూ.55వేలకోట్లను పింఛన్ల రూపంలో పేద, మధ్య తరగతి వర్గాలకు అందించిన ఘనత చంద్రబాబుదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఆయన కూటమినాయకులతో కలిసి పట్టణంలోని 37, 38 వార్డులు, మూడు మండలాల పరిధిలోని లింగుంగుంట్ల, అప్పాపురం, దింతెనపాడు గ్రామాల్లో పేదలసేవలో కార్యక్రమలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
దేశంలో ఏ రాష్ట్రము.. ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా చంద్రబాబు రాష్ట్రంలోని పేదలకు సామాజిక పింఛన్లు అందిస్తున్నారని, ఆదాయవనరులు లేకపోయినా కూడా ప్రజాసంక్షేమానికి ఆయన ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా ప్రతినెలా ఠంచన్ గా 1వ తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు పింఛన్లు అందిస్తున్నది మన రాష్ట్రమేనన్నారు. మొంథా విపత్తు రాష్ట్రాన్ని కబళించి, తీవ్ర నష్టం కలిగించినా ఏపీలో పింఛన్ల పంపిణీ ఆగలేదంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబు నాయకత్వమేనని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.
*రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరిగితే.. వైసీపీకి, జగన్ కు బాధ..*
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగడాన్ని వైసీపీ భరించలేకపోతోంది. నిత్యం ఏడుస్తూ సమర్థంగా పనిచేస్తున్న కూటమిప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతోంది. రాష్ట్రంలో బాధపడే వారు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ.. జగన్ మోహన్ రెడ్డేనని, ప్రజలకు పింఛన్లు పంచడాన్ని కూడా ఓర్చుకోలేని స్థితిలో ఉన్నారని ప్రత్తిపాటి ఎద్దేవాచేశారు. ప్రజా సంక్షేమం..రాష్ట్రాభివృద్ధి అనే నిరంతర ప్రక్రియను కూటమిప్రభుత్వం కొనసాగిస్తుందని, దాంతో వైసీపీ బాధతో కుంగి..కృశించి చివరకు రాజకీయాల నుంచే కనుమరుగు అవుతుందని ప్రత్తిపాటి తెలిపారు. పవన్ కల్యాణ్ చెప్పినట్టు చంద్రబాబు నాయకత్వం సుదర్ఘీ కాలం కొనసాగడం ఖాయమని, ఇతర రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి పనితీరును నిత్యం గమనిస్తున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. దేశంలో ఏ నాయకుడికి లేని పేరు, ప్రతిష్ఠలు.. విశ్వసనీయత చంద్రబాబుకే ఉండటం తెలుదేశంపార్టీకి, ప్రజలకు గర్వకారణమని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, టీడీపీ నాయకులు మద్దూరి వీరారెడ్డి, మద్దుమాల రవి, కోడె హనుమంతరావు, కందిమల్ల రఘురామారావు, తుబాటి కిషోర్, జంగా వినాయకరావు, నెల్లూరి హరిబాబు, చౌదరి, తోకల రాజేష్, మాణిక్యారావు, పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ఎమ్మార్వో లు, ఎంపిడివోలు, టీడీపీ ముఖ్య నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.