రాజకీయాల్లో సేవాభావమే కొలమానం కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ తాడేపల్లిగూడెం
(అక్షర విజేత)
పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో: రాజకీయాల్లో డబ్బే ప్రధానం కాదని చాలా బాగుంది మంచి ఆలోచన విధానం కొలమానమని నిరూపించిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ శర్మ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం ఎస్ వి ఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన మాజీ మంత్రి దివంగత నేత పైడికొండల మాణిక్యాలరావు కాంస్య విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తనకున్న ఆత్మీయ కుటుంబ బాంధవ్యాలను వివరించారు.
మాణిక్యాలరావు 2014లో అసెంబ్లీకి పోటీ చేసి మంత్రి అయిన సందర్భంలో పొత్తు కారణంగా నీకు ఎన్నికలలో అవకాశం రాలేదని, తదుపరి మంచి అవకాశం వస్తుందని ఆయన అనేకసార్లు చెబుతూ ఉండేవారన్నారు. మాణిక్యాలరావుకు టికెట్ వచ్చినప్పుడు కొంతమంది ఏ విధంగా అల్లరి చేశారో ఈ ఎన్నికల్లో తణుకు ఎంపీ టికెట్ వచ్చినప్పుడు డబ్బు లేదని ఎలా గెలుస్తారు అంటూ కొందరు అల్లరి చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసే తమ విజయానికి కృషి చేశారన్నారు. ఆయన స్నేహపూర్వక ఆశీస్సులు కారణంగానే తాను కేంద్రమంత్రి కాగలిగానని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరువరానిదన్నారు. తమ విజయంలో ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కృషిని కొనియాడారు. సభాధ్యక్షులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంత స్వరూపాన్ని మార్చివేసి ఎంతో అభివృద్ధి చేసిన మహనీయుడు పైడికొండల మాణిక్యాలరావు అని నివాళులర్పించారు. జాతీయ సాంకేతిక విద్యాలయం ( ఎన్ ఐ టి ) సాధన కోసం పెద్ద ఎత్తున చేసిన పోరాటం మర్చిపోలేమన్నారు. కొంతమంది ఇదే ప్రదేశంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేశారని, నెట్టు ఏర్పాటు అయ్యాక ప్రత్యామ్నాయ ప్రదేశంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని అప్పుడు మాట ఇచ్చిన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో ఇక్కడ విమానాశ్రయం మంజూరు అయిందని వివరించారు. ఈ ప్రాంతానికి రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన పైడికొండల మాణిక్యాలరావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గతంలో వారి కుటుంబ సభ్యులు నాయకులు ప్రయత్నించిన అప్పటి ప్రభుత్వంలో సాధ్యం కాలేదు అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత పైడికొండల కుటుంబ సభ్యులు తనను కలిసినప్పుడు మాణిక్యాలరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని విధాల సహకరిస్తానని తెలిపినట్టు చెప్పారు. ఈనాటికి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. ఆయన ఆశయాలు సాధనకు అందరు కృషి చేయాలి అన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ దివంగత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఆయన బాటలోనే రాజకీయంగా తన వంతు సేవలందిస్తున్నారని ఆయన మరణం తీరని లోటని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్ఐటి సాధనకు మాణిక్యాలరావు చేసిన కృషి ఆదర్శనీయమన్నారు. ఆయనతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులు ఇతర కార్మికుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జి మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తిగా అసామాన్య స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడు మాణిక్యాల రావు అని కొనియాడారు. తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి ఏర్పాటుకు ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఆయన లేకపోవడం ఈ ప్రాంతానికి రాష్ట్రానికి తీరనిలోటని పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు పృథ్వీరాజ్(విశాఖపట్నం) మాట్లాడుతూ అతి సామాన్యుడైన మాణిక్యాలరావు అసమాన్య నాయకుడిగా ఎదిగారు అన్నారు. ఆయన ఉన్నత వ్యక్తిత్వం తమ అనుబంధాన్ని పెంపొందించిందనుఅన్నారు. పార్టీ నాయకుడిగా, మంత్రిగా ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవ ఆదర్శనీయమన్నారు. బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా మాణిక్యాలరావుతో ఉన్న స్నేహాన్ని అనుబంధాన్ని వివరించారు. ఆయన ముక్కుసూటి గా ఉండేవారని కొన్ని సందర్భాల్లో ముక్కోపిగా ఉండేవారని తెలిపారు. పార్టీలో సుదీర్ఘకాలం కలిసి పనిచేశామని ఎమ్మెల్యేగా మంత్రిగా మాణిక్యాలరావు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. బిజెపి ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ రాజకీయంలో మాణిక్యాలరావు తనకు మార్గదర్శగా ఉండేవారని, ఆయన చేసిన సేవలు ఆదర్శం నీయమ న్నారు. బిజెపి జిల్లా పూర్వ అధ్యక్షులు నార్ని తాతాజీ మాట్లాడుతూ బీజేపీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు చేసిన సేవలు మరెవరు అని అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేశారన్నారు.బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ మాట్లాడుతూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మిప్రసన్న సాలగ్రామ,బిజెపి ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ ఉన్నమట్ల కబర్థి, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, తెలుగుదేశం సీనియర్ నాయకులు పసలు అచ్యుతం, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశి, తదితరులు మాట్లాడారు. తొలిత కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మాణిక్యాలరావు కుమార్తె సింధు గట్టిం, నవీన్ గట్టిం, ఆవిష్కరించారు. బిజెపి శ్రీ కాళహస్తి అసెంబ్లీ ఇన్ చార్జి కోలా ఆనంద్ కుమార్, బిజెపి జిల్లా నాయకులు గట్టు మాణిక్యాలరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచిమర్తి నాగేశ్వరరావు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్, పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, డాక్టర్ పృద్వి, అయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర రైతు నాయకులు కర్రి సీతారామయ్య, బిజెపి రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కార్యక్రమాన్ని నిర్వహించారు. బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యురాలు నిర్మల కిషోర్, నర్సాపురం పార్లమెంట్ ఇన్చార్జి పేరిచర్ల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, జక్కంపూడి కుమార్, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్చార్జి శరణాల మాలతీ రాణి, ఉంగుటూరు మండల బిజెపి అధ్యక్షురాలు అడపా శోభారాణి, బిజెపి నాయకులు పసుపులేటి వెంకట రామారావు, నరిసే సోమేశ్వరరావు, తాడేపల్లిగూడెం బిజెపి రూరల్ అధ్యక్షులు సమయంవంతులు కాశి, పడమరవిప్పర్రు సొసైటీ అధ్యక్షులు పసుపులేటి అమ్మిరాజు, పెంటపాడు మండల అధ్యక్షుడు ఇమ్మంది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మార్నీడి బాబ్జి, మానవతా స్వచ్ఛంద సేవా పాప్ సంస్థ నాయకులు కార్యకర్తలు, పైడికొండలో మాణిక్యాల రావు గారి కుమార్తె సింధు, అల్లుడు నవీన్, గట్టిం మాణిక్యాలరావు, రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల మరియు ఇతర కార్మికుల సంఘ చైర్మన్ శ్రీ వలవల బాబ్జి గారు, రాష్ట్ర ప్రధాన ప్రసన్న లక్ష్మి గారు,బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇన్చార్జ్ ఈతకోట భీమశంకరరా వు (తాతాజీ), రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి,బిజెపి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవిగారు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జ్ కోలా ఆనంద్, బిజెపి పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి నివాళులర్పించారు తదితర ప్రముఖులు, నాయకులు, మాణిక్యాలరావు గారి స్నేహితులు, బంధువులు ఈ కార్యక్రమానికి హాజరై వారికి మాణిక్యాలరావు గారికి ఉన్న సాన్నిహిత్యాన్ని గురించి వివరించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు మాణిక్యాలరావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.