ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలి ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమ సుందర్ తాడేపల్లిగూడెం
(అక్షర విజేత)
పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో:
కార్మికోద్యమ వ్యవస్థాపకుల ఉద్యమ స్ఫూర్తితో కార్మికహక్కుల పరిరక్షణకోసం పోరాటాలు సాగించాలని ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ పిలుపు ఇచ్చారు.
ఎఐటియుసి 106 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు .తాడేపల్లిగూడెం ఏరియాలోని పలు కార్మిక కేంద్రాల్లో , యూనియన్ కార్యాలయాల్లో , గ్రామాల్లో సుమారు ముప్పై కేంద్రాల్లో పతాకావిష్కరణలు చేశారు.. ఆయా ఆవరణలను ఎఐటియుసి తోరణాలతో అలంకరించారు. రంగురంగుల ముగ్గులతో శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సమావేశాల్లో ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. సోమసుందర్, ఏరియా సమితి అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, కార్యదర్శి మందలపర్తి హరీష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కళింగ లక్ష్మణరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కే.లక్ష్మీనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, భవన నిర్మాణ 26కార్మికసంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ మాట్లాడారు.
ఎఐటియుసి పోరాట చరిత్రను వారు వివరించారు. నవంబర్ 26 న జాతీయ స్థాయి నిరసన దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.
ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు
డి.సోమసుందర్ మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి హక్కులు లేని బ్రిటిష్ పాలనాకాలంలో 1920 అక్టోబర్ 31 న ఎఐటియుసి ఆవిర్భవించిందని, జాతీయోద్యమ వీరులు దీనికి సారధ్యం వహించారని, నాటి వ్యవస్థాపక నాయకులు కార్మికులకోసం ఎన్నో పోరాటాలు చేశారని, ఏళ్ళతరబడి జైళ్ళలో మగ్గిపోయారని, ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించారని వారి పోరాటాలు, త్యాగాలతోనే కొన్ని కార్మికచట్టాలు అమలులోకి వచ్చాయని అన్నారు.
స్వాతంత్ర్యోద్యమంలో ఎఐటియుసి ప్రముఖపాత్ర పోషించిందనీ, కార్మిక, సామాజిక అజెండాను గట్టిగా ముందుకు తేవడంలో గొప్ప కృషి చేసిందని సోమసుందర్ గుర్తు చేశారు. రాజ్యాంగ ఆదర్శాల రూపకల్పనలో సైతం ఎఐటియుసి భావజాలం పాత్ర కీలకంగా పనిచేసిందని అన్నారు. రానున్న నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం రోజున కేంద్ర కార్మికసంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త నిరసనదినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ అప్పట్లో తీవ్ర నిర్బంధాలు అనుభవిస్తూ కూడా ఎన్నో పోరాటాలు చేసి కార్మికహక్కులను, కార్మికచట్టాలను ఎఐటియుసి నేతలు సాధించారని అన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఎలాంటి పాత్ర లేనివారు, శ్రామికులపట్ల గౌరవం లేనివారు రాజ్యాధికారం చెలాయిస్తూ కార్మికహక్కులను హరిస్తున్నారని, కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు.
మందలపర్తి హరీష్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంనాడు కార్మికనేతలు సాధించిన హక్కులను నేటి పాలకులు హరిస్తున్నారని, అలనాటి నేతల పోరాట స్ఫూర్తితో కార్మికహక్కుల పరిరక్షణకోసం రెట్టింపు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద ఎఐటియుసి పతాకాన్ని ఓసూరి వీర్రాజు, ఏరియా ఆస్పత్రివద్ద సీనియర్ కార్మికులు సత్యనారాయణ, రమణమ్మ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద భాషా, శివకుమార్, భవననిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం వద్ద పడాల శ్రీనివాస్, సి.డబ్ల్యూ.సి.గోడౌన్ వద్ద సింహాచలం, మార్కెట్ యార్డ్ వద్ద మేళం నాగరాజు, అనుబంధం మినీ ట్రక్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద సీనియర్ కార్మికుడు సత్యనారాయణ ఎఐటియుసి పతాకాలను ఎగురవేశారు.
ఏరియా లోని పలుగ్రామాల్లో భవన నిర్మాణ కార్మికసంఘం ఆధ్వర్యంలో ఎఐటియుసి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమాల్లో ఎఐటియుసి నాయకులు కొడమంచిలి చంద్రరావు, మార్లపూడి కాటమరాజు, ఉప్పాటి నాగరాజు, మండేలి రామకృష్ణ, మండేల్లి సత్యనారాయణ, రౌతు రాజేష్, శివశంకర్, ధనాల రవి, విజయ, కనకమహాలక్ష్మి, జయసుధ, చోడగిరి వెంకటరమణ, అత్తిలి బాబీ, కోడె సాయిబాలాజీ, కే.రాంబాబు, యాలం నర్సన్న, తాడేపల్లి వెంకటేష్, ఏడుకొండలు, గాది శ్రీను, విజయకుమార్, నానీ, నాగేంద్ర, ఐ.ఎన్.కుమార్, వెంకట లక్ష్మీ, కుమారి, సురేష్, సత్తిబాబు,అప్పారావు నాయకత్వం వహించారు.