సర్కార్ ఆస్పత్రిలో వసతులు కరువు. గర్భిణులకు తప్పని తిప్పలు. ప్రభుత్వాసుసుపత్రిలో కనీస వసతులు కరువయ్యాయి. ఐక్యవేదిక సతీష్ యాదవ్.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి ప్రసూతి ప్రభుత్వాసుసుపత్రిలో కనీస వసతులు కరువయ్యాయి. జిల్లాలో టెస్టులు ఐ సి యు లేక ఇతర వ్యాధులకు సంబంధించిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రావడానికి వారం రోజులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం.. అభివృద్ధి అంతా మేమే చేస్తున్నాం. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలందిస్తున్నాం.. ఇవీ నాయకులు ఇచ్చే ప్రసంగాలు.. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇక గర్భిణులకు చికిత్స కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో టీ హబ్ ఎలుకలు కొరికి పని చెయ్యని బయో కెమిస్ట్రీ థైరాయిడ్ మిషన్ల ఉన్నాయని ఐక్యవేదిక సతీష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు ప్రజలు 60 టెస్ట్‌లకు దూరం అవుతున్నారని ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం వందల మంది చికిత్స కోసం క్యూ కడుతున్నారు. వనపర్తి జిల్లాలో మండలాల వారీగా పీహెచ్‌సీలు ఉన్నపటికీ అక్కడ సరిగా బెడ్స్, సౌకర్యాలు లేవని చాల వరకు కేసులు మండల కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రికి రెఫెర్ చేస్తున్నారు. తీరా ఇక్కడికి వస్తే అదే పరిస్థితి ఎదురవుతుంది.
వనపర్తి జిల్లాలో గర్భిణులకు తిప్పలు
ప్రసూతి కోసం హాస్పిటల్‌కు వస్తున్నారు. దాదాపు రోజుకు 20 నుంచి 30 వరకు డెలివరీలు అయ్యే ఈ హాస్పిటల్ గర్భిణులతో నిండిపోతుంది. ఉండేందుకు వారికి వసతులు లేకుండాపోయాయి. వార్డులలో బెడ్స్ ఉన్న వాటి పైకి బెడ్ కొన్ని గదుల్లో బాత్రూంలో నీళ్లు రాకపోవడంతో గంటల తరబడి నీటి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. రాత్రి దోమల బెడద, ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడంలో జాగారం చేయాల్సి వస్తుందని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వాసుపత్రిలో వసతులు మెరుగుపరిచి టి హబ్ ఉపయోగాలకు తీసుకురావాలని అఖిలపక్ష ఐక్యవేదిక సతీష్ యాదవ్ తదితరులు డిమాండ్ చేశారు