విజయవంతమైన ఐక్యత పరుగు ==గెలుపు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన రేవల్లి ఎస్సై రజిత ==సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కార్యక్రమం
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ఐక్యత పరుగు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అనంతరం గెలుపు పొందిన విద్యార్థులు మొదటి బహుమతి రహీం ప్రభుత్వ పాఠశాల టెన్త్ క్లాస్, రెండవ బహుమతి కీర్తన సిక్స్త్ క్లాస్ నాగపూర్ స్వామి వివేకానంద ప్రైవేట్ పాఠశాల, మూడవ బహుమతి చందు ఎయిత్ క్లాస్ రేవల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రేవల్లి ఎస్సై రజిత బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, ప్రభుత్వ జడ్.పి.హెచ్.ఎస్ హెడ్మాస్టర్ ప్రసాద్, రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు, ప్రవేట్ ఉపాధ్యాయులు శ్యాము, నాగపూర్ ప్రతాపరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బండ రావిపాకుల మాజీ సర్పంచ్ నారాయణ, కారోబార్ రాజు, అదేవిధంగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.